Search This Blog

Tuesday, January 15, 2013

BHARATHEEYA SAMSKRUTHI


పాశ్యాత్య సంస్కృతిలో పడి మనము పుట్టిన రోజు పండుగను ఆ అర్థానికి వ్యతిరేకంగా జరుపుకుంటున్నాము  . భారతీయ సంస్కృతి ఏ దేశియులైన ఏ పద్ధతి వారైన ప్రకృతిని ఆధ్యాత్మికతను ఆరోగ్యాన్ని అనుసంధానము చేస్తూ శాస్త్రీయతకు పెద్ద పీట వేస్తూ జరిపే ఆచారాన్ని నిరభ్యరంతంగా పాటించవచ్చు. ఎటొచ్చి విదేశీ సంప్రదాయాల్ని మన లో కొంతమంది జన్మదినాన దీపాలు ఆర్పి మాంసాదులు స్వీకరించి దైవ స్మరణ పూర్తిగా విస్మరిస్తున్నారు.
పుట్టిన రోజు అభ్యంగ స్నానం, కొత్త వస్త్రములు ధరించడము, రక్షా తిలకం దరించ వలెను. 
ఆ రోజు మొదట గణపతిని కులధైవాన్ని స్మరించాలి. తదుపరి సూర్యుని మార్కొండేయుని, షష్టీ దేవిని మరియు సప్త చిరంజీవులను పూజించి నమస్కరించవలెను. 

మంత్రములు:

చిరంజీవీ యధా త్వం భో భవిష్యామి మహామునే !
రూపవాన్ విత్తవాం శ్చైవ శ్రియాయుక్తశ్చ సర్వదా !!
మార్కొందేయ నమస్తేస్తు సప్తకల్పాంత జీవన !
ఆయురారోగ్య సిద్ధ్యర్ధం ప్రసీద భాగవన్మునే !!


చిరంజీవీ యధాత్వంతు మునీనాం ప్రవరో ద్విజ !
కురుష్వ మునిశార్దుల తదా మాం చిరజీవినం !
మార్కొందేయ ! మహాభాగ ! సప్తకల్పాంత జీవనః !
 ఆయురారోగ్య సిద్ధ్యర్ధం అస్మాకం వరదోభవ !!


జయదేవి జగన్మాతః జగదానంద కారిణి !
ప్రసీద మమ కల్యాణి నమస్తే షష్ఠ దేవతే !!
త్రైలోక్యేయాని భూతాని స్థావరాని చరానిచ !
బ్రహ్మ విష్ణు శివైస్సార్ధం రక్షాం కుర్వంతు తానిమే !!   


అశ్వత్థామా బలిహి వ్యాసః హనుమాంశ్చ విభీషనః 
కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః !
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మర్కొందేయ మధాష్టమం 
జీవేధ్వర్ష  శతం   ప్రాజ్ఞః అపమృత్యు వివర్జితః !


ఈ మంత్రములు పటించి రుద్రభిషేకము జరిపించి లలితా విష్ణు సహస్ర నామ పారాయణము చేసి దానములు ఇవ్వవలెను.
----------------------------------------------------------------------------------------

భారతీయ సంస్కృతిలో ఏ భగవత్స్తుతి అయిన మొదట తత్ సంభంధమయిన దేవత ప్రార్ధన, రెండవది అంతర్లీనమయిన భగవత్ సంభంధమయిన జ్ఞానం, మానవులు తనకు తాను అన్వయించుకోవలసిన జ్ఞాన విజ్ఞానములు.
గణపతికి మొదట పూజించటంలో అంతరార్ధం.  మనకు అన్వయించుకొంటే అందు లోని అర్ధం తెల్లని వస్త్రాలు ధరించి, అన్ని దిక్కుల దృష్టి వుంచి, నలుపు నుంచి ఏ రంగు అయిన మిక్కిలి శ్రద్ధ వుంచి,  నాలుగు చేతులకు పని కల్పించి, ప్రస్సంనంగా నవ్వుతు ఏపనినైన ప్రారంభించాలని  అలా చేస్తే ఏ విఘ్నాలు రావని అర్ధం.

శ్లో!! 1. శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
         ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే 

ప్రాతః కాలమునే నిద్ర లేచిన వెంటనే తన అరచేతిని చూస్తూ పటించవలసిన మంత్రము: 
         
    2 కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి
        కరమూలేతు గోవిందః (స్థితా గౌరీ )  ప్రభాతే కరదర్శనం

కాలు మొదట నెల మీద మోపుతూ పటించవలసిన మంత్రము: 

    3.  సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే 
        విష్ణు పత్నిం నమస్తుభ్యం పాధస్పర్శం క్షమస్వమే  

నదీ స్నానము చేయలేని వారు సదా ఈ పుణ్య తీర్ధాలలో స్నానమాచరించినటుల భావించి  పటించవలసిన మంత్రము: 

   4. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి!
       నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు!!
       నమో గంగే నమో గంగే నమో గంగే నమో నమః 
       నమో గంగే తమోఘ్నే ! శ్రీ గంగే ! గంగే ! నమో నమః 

  సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారు కుంకుమ ధరించునపుడు పటించవలసిన మంత్రము: 

   5. కుంకుమం శోభనం దివ్యం 
       సర్వదా మంగళ ప్రదం 
       ధారనేనాస్య  శుభదం 
       శాంతి రస్తు సదా మమః

భోజన సమయమునందు  పటించవలసిన మంత్రము: 
   6. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ర్భహాగ్నౌ బ్రహ్మణాహుతం 
       బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా 
       అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రితః 
       ప్రానపాన  సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం !!
       లక్ష్మీ విష్ణు ప్రియా బ్రాహ్మీ శ్రీప్రదా సర్వ  మంగళా !
సర్వ దేవ్యాత్మికా మాతా భోజనే సమయేమతు !!